డిజిటల్/సైబర్ ప్రపంచములో మీ గుర్తింపు

మీ పేరు, చిరునామా, ఇమెయిల్ ఐడి వంటి మీకు సంబంధించిన మరియు దాని ద్వారా సైబర్ చోటులో మీరు గుర్తించబడగలిగిన లేదా మిమ్మల్ని వెతుక్కోగలిగిన మీ సమాచారము అంతా డిజిటల్ ప్రపంచములో మీ గుర్తింపుగా ఉంటుంది.

మొబైల్స్, ఇంటర్నెట్, ఇమెయిల్స్ మొదలైనవన్నీ డిజిటల్ ప్రపంచం యొక్క భాగాలు.  మీ జీవితాన్ని సులభతరం చేసే మరియు మీరు చూసే ప్రతి ఉపకరణము/ఉపయోగించే ప్రతి సాంకేతిక పరిజ్ఞానము డిజిటల్ ప్రపంచములో మీ సమాచారాన్ని ముప్పులో ఉంచగలుగుతుంది.

గుర్తింపు చోరీ అంటే ఏమిటి?

ఈ క్రింది విధమైన మీ వ్యక్తిగత లేదా సామాజికంగా గుర్తించదగిన సమాచారాన్ని దొంగిలించడం లేదా దురుపయోగం చేయడం: పేరు, ఫోన్ నంబరు, స్కూల్ వివరాలు, ఇమెయిల్-ఐడి, పుట్టిన రోజు, చిరునామా, గుర్తింపు కార్డు నంబరు, ఆధార్ కార్డు వివరాలు, పాస్‌పోర్ట్ వివరాలు, ప్రయాణ వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలు, వ్రేలిముద్రలు, స్వరం నమూనా మొదలైనవి   దురుపయోగ పరచడం అనేది  గుర్తింపు చోరీ.

అది ఎందుకు ముఖ్యము?

గుర్తింపు చోరీ అనేది ఎవ్వరికైనా, ఏ సమయములోనైనా జరగవచ్చు. అది అనేక రూపాలు మరియు ఆకారాలలో ఉండవచ్చు. అది మీకు సంభావ్య నష్టాన్ని కలిగించవచ్చు, మరియు మీ తల్లిదండ్రులు/ కుటుంబం కష్టపడి సంపాదించిన డబ్బు కోల్పోవడానికి కారణం కావచ్చు. భౌతిక ప్రపంచములో మీకు మీరు రక్షించుకోవడానికి ఎల్లప్పుడూ జాగరూకతతో ఉంటారు. సైబర్ ప్రపంచములో మీకు మీరుగా రక్షించుకోవడానికి కూడా అదే జాగరూకత అవసరము. సైబర్ ప్రపంచము అనేది భౌతిక ప్రపంచములాగే ఎంతో బాగుంటుంది మరియు అవసరమైన చర్యలు గనక తీసుకోకుంటే అంతే సమానమైన ముప్పు ఉంటుంది. వాస్తవానికి డిజిటల్ ప్రపంచములో మిమ్మల్ని మీరు మరియు మీ కుటుంబం ఇంకా స్నేహితుల్ని రక్షించుకోవడానికి మీరు అదనపు ముందుజాగ్రత్తలు మరియు నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.  మీ గుర్తింపును రక్షించుకోవడం మీ బాధ్యత. ఈ రోజున సైబర్ ప్రపంచం మనం సమస్యలు/సైబర్ నేరాలను ఆపలేని లేదా నయం చేయలేని స్థాయికి చేరుకొంది, అందువల్ల అది మీకు జరిగే ముందుగా ఈ నేరాల నుండి మీకు మీరు రక్షించుకోవడం ఎల్లప్పుడూ మంచిది.  

ఒక గుర్తింపు చోరీ ఎప్పుడు చోటు చేసుకుంటుంది?

ఈ క్రింద కనబరచినవి సైబర్ నేరస్థులు వ్యక్తి యొక్క గుర్తింపును దొంగిలించడానికి ఉపయోగించే వివిధ రకాల మార్గాలు. 

 • వ్యక్తిగత సమాచారమును కోరుతూ రెస్టారెంట్లలో, షాపింగ్ మాల్స్/సినిమా థియేటర్లలో ఇవ్వబడిన సర్వే ఫారములు, లక్కీ డ్రా కూపన్లలో ఎంటర్ చేసిన డేటా.
 • మీరు మామూలుగా ఫోన్ పై మాట్లాడుతున్నప్పుడు లేదా మీ వ్యక్తిగత మరియు కుటుంబ విషయాల గురించి నేరుగా బహిరంగ స్థలాల్లో మీ కుటుంబము మరియు మిత్రులతో మాట్లాడేటప్పుడు పంచుకున్న డేటాను మరియు సంభాషణలను మోసగాళ్ళు గమనిస్తూ మరియు వింటూ ఈ సమాచారమును మోసపూరిత చర్యలకు వాడుకుంటారు.
 • సూపర్ మార్కెట్లు మరియు మెడికల్ స్టోరులు మరియు మాల్స్ లోని రిటెయిల్ చైన్లలో షాపింగ్ చేసిన తర్వాత ఎంటర్ చేయబడే డేటా.
 • నగదు బహుమతి/లాటరీ/ఉద్యోగ ఆఫర్ల రూపములో ఇమెయిల్/వాట్సాప్/ సంక్షిప్త సందేశం ద్వారా కొంత ప్రయోజనాన్ని వాగ్దానం చేస్తూ మెయిల్స్/సందేశాల ద్వారా సేకరించబడిన డేటా. అధికారికమైనది అనిపించేలా ఒరిజినల్ వెబ్‌సైట్ల యొక్క లోగోల మాదిరిగానే వాళ్ళు లోగోలు తయారు చేసి మెయిల్స్ పంపిస్తుంటారు. మరొక పేజీకి తీసుకువెళ్ళే ఒక లింక్ పై క్లిక్ చేయమని వాళ్ళు అడగవచ్చు, అక్కడ పాస్‌వర్డులు, ఓటిపి ల వంటి వ్యక్తిగతమైన కీలకమైన సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అడుగుతారు.
 • ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్స్, ఇ-కామర్స్ సైట్లు మరియు ఆన్‌లైన్ బ్యాంక్ ఖాతాల నుండి నేరస్థులు మీ ప్రైవేటు సమాచారాన్ని చేచిక్కిచుకోవచ్చు మరియు ఆ సమాచారాన్ని మీకు వ్యతిరేకంగా తమ స్వీయ ప్రయోజనం కోసం వాడుకోవచ్చు.
 • గుర్తింపు దొంగలు మామూలుగా సామాజిక మాధ్యమములో ఒక నకిలీ ఖాతా ద్వారా విభిన్న ప్రొఫైల్స్ గుండా వెళుతుంటారు. ప్రొఫైల్స్ నుండి దాడి చేయడం కోసం వాళ్ళు కొందరు అమాయకులను లక్ష్యంగా చేసుకుంటారు. సంబంధాన్ని కలుపుకోవడానికి వాళ్ళు ‘ఫ్రెండ్' రిక్వెస్ట్ పంపిస్తారు మరియు చాటింగ్ ద్వారా మీ విశ్వాసాన్ని పొందే ప్రయత్నం చేస్తారు. విశ్వాసాన్ని పొందిన తర్వాత, వాళ్ళు ఆ వ్యక్తుల నుండి కీలకమైన  వ్యక్తిగత సమాచారాన్ని పట్టేసుకుంటారు.
 • ప్రభుత్వ రిజిస్టర్లు లేదా బహిరంగ రికార్డులలో సరిగ్గా నిర్వహించబడని డేటా.
 • సురక్షితం కాని లేదా సరిగ్గా పర్యవేక్షణ చేయబడని కంప్యూటర్ సర్వర్ల నుండి నేరస్థులు సమాచారాన్ని పునరుద్ధరించి తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. వాళ్ళు సరిగ్గా కాన్ఫిగర్ చేయబడని లేదా తెలియకనే ఓపెన్ చేసే పోర్టుల ద్వారా రూటర్లను ప్రాప్యత చేసుకోవచ్చు, లేదా గుర్తింపు చోరీలకు నిస్సహాయంగా ఉండే బలహీనమైన పాస్‌వర్డులను కలిగి ఉన్న రౌటర్లను అందుబాటులోకి తెచ్చుకోవచ్చు .
 • వ్యక్తిగత సమాచారమును దొంగిలించడమనేది మాల్‌వేర్ ద్వారా జరగవచ్చు. మాల్‌వేర్ ని మెయిల్/ఎస్.ఎం.ఎస్/వాట్సాప్ లింక్ ద్వారా పంపించవచ్చు. మాల్‌వేర్లు వైరస్‌లు, స్పైవేర్, రూట్‌కిట్స్, రిమోట్ యాక్సెస్ టూల్స్ వంటి వివిధ రూపాలలో ఉండవచ్చు.
 • స్మార్ట్ క్రెడిట్/డెబిట్ లేదా ఇతర స్మార్ట్ పేమెంట్ కార్డుల (షాపింగ్, గిఫ్టింగ్ కార్డుల వంటివి) నుండి వ్యక్తిగత సమాచారమును దొంగిలించడం అనేది కార్డును తాకక పోయినప్పటికీ సైతమూ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్.ఎఫ్.ఐ.డి) ద్వారా రీడ్ చేసి చేయవచ్చు.

గుర్తింపు చోరీ నుండి మీకు మీరు ఎలా రక్షించుకోవాలి?

ఈ క్రింద కనబరచినవి మీ గుర్తింపును కాపాడుకోవడానికి మరియు సైబర్ ప్రపంచం భద్రత నుండి ప్రయోజనం పొందడానికి ఉత్తమ ఆచరణలను వృద్ధి చేసుకోవడానికై మీకు సహాయపడేందుకు కొన్ని చిట్కాలు మరియు చర్యలు.   

 • మీ మొబైల్, కంప్యూటర్ మరియు ఇతర డిజిటల్ ఉపకరణాలు లేదా అప్లికేషన్లు అన్నింటికీ అక్షరాంశాలు/స్పెషల్ క్యారెక్టర్స్ (&,#, %, @ , ! ...), అంకెలు మరియు అక్షరాల సమ్మేళనముతో ఎల్లప్పుడూ ఊహించడానికి కష్టమయ్యే గట్టి పాస్‌వర్డులనే వాడండి.
 • మీ పాస్‌వర్డును మారుస్తూ ఉండండి మరియు విభిన్న పాస్‌వర్డులను వాడుతూ ఉండేలా చూసుకోండి.
 • విశ్వసనీయత లేని వెబ్‌సైట్లను బ్రౌజ్ చేయడం మానండి, అనుమానిత లింక్ లు, వచన సందేశాలపై/టెక్స్ట్ మెసేజ్లు  కూడా క్లిక్ చేయవద్దు, ఎందుకంటే గుర్తింపు చోరీకి అవి ఒక ఎర కావచ్చు.
 • పాస్‌వర్డులు, ఖాతా నంబర్లు, పిన్ నంబర్లు మొదలగు మీ వ్యక్తిగత మరియు కీలక  సమాచారాన్ని ఎప్పటికీ ఫోన్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా ఎప్పటికీ ఇచ్చివేయవద్దు.
 • కాగితాలు, పుస్తకాలు, మొబైల్ నోట్స్ మున్నగు వాటిపై మీ వ్యక్తిగత మరియు గోప్యత/కీలక సమాచారమును ఎప్పటికీ వ్రాయవద్దు.
 • భౌతిక చోరీ జరిగిన పక్షములో నష్టాన్ని తగ్గించుకోవడానికి గాను గుర్తింపు కార్డులు, లైసెన్సు వంటి ముఖ్యమైన పత్రాల యొక్క డూప్లికేట్ కాపీలను ఎల్లప్పుడూ మీ వద్ద ఉంచుకోండి.
 • మీ డిజిటల్ సంపత్తిని పరిరక్షించుకోవడానికి ఈ క్రిందివాటిని నిర్ధారించుకోండి:
  • ధృఢమైన ఫైర్‌వాల్స్
  • బహిరంగ ప్రదేశాలలో ఇంటర్నెట్ వాడటానికి  కోసం విపిఎన్ ఉపయోగించండి.
  • నిర్ధారిత వ్యవధి కాలం లో   మాల్‌వేర్ మరియు వైరస్ స్కాన్‌లు
  • ఆటోమేటిక్ గా విండోస్ మరియు ఇతర సాఫ్ట్ వేర్ అప్‌డేట్‌లు
  • సురక్షితమైన వైర్‌లెస్ నెట్‌వర్క్ లు
  • మీ కంప్యూటర్ ను  ఎవరైనా వాడేందుకు అనుమతి లేకుండా జాగ్రత్తలు తీసుకోండి.
Page Rating (Votes : 7)
Your rating: