USB  (యూనివర్సల్ సీరియల్ బస్) ఈ స్టోరేజ్ డివైజ్ లు వివిధ కంప్యూటర్ల మధ్య డేటాను బదిలీ చేయడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. మీరు దీనిని USB పోర్ట్లో పెట్టవచ్చు, మార్గమద్యలో మీ డేటాను కాపీ చేయవచ్చు మరియు  తీసివేయవచ్చు,  దురదృష్టవశాత్తూ ఈ పోర్టబిలిటీ, సౌలభ్యం మరియు ప్రజాదరణ కూడా మీ సమాచారాన్ని వివిధ బెదిరింపులు గురి చెస్తుంది.

డేటా దొంగతనాలు మరియు డేటా లీకేజ్ ఇప్పుడు రోజువారీ వార్తలు! వీటి సంరక్షణ, అవగాహన మరియు సమాచారాన్ని సురక్షితంగా ఉంచడం అనేది అనువైన సాధనాలను ఉపయోగించడం ద్వారా నియంత్రించడం లేదా తగ్గించడం చేయవచ్చు.

బెదిరింపులు

  1. మాల్వేర్ ఇన్ఫెక్షన్
  • USB స్టోరేజ్ డివైజ్ ల ద్వారా మాల్వేర్ విస్తరించబడుతుంది. మీ కార్యకలాపాలు, ఫైల్లు, వ్యవస్థలు మరియు నెట్వర్క్లను ట్రాక్ చేయడానికి ఎవరైనా మాల్వేర్తో కూడిన USB స్టోరేజ్ డివైజ్ లను విక్రయించవచ్చు.
  • ఈ మాల్వేర్ USB స్టోరేజ్ డివైజ్ ద్వారా autorun.exe  ని ఉపయోగించి ఒక పరికరం నుండి మరొక పరికరానికి వ్యాప్తి చెందుతుంది
  1. అనధికార వినియోగం

డేటా కోసం మీ USB పరికరాలను ఎవరో దొంగిలిస్తారు

  1. బెయిటింగ్

ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా మీ డెస్క్ లేదా స్థలంలో మాల్వేర్ తో కూడిన USB పరికరాలను వదిలి వెళ్తారు

 

USB స్టోరేజ్ ద్వారా డేటా లీకేజ్ లను ఎలా ఆపాలి?

  • USB స్టోరేజ్ డివైజ్ వినియోగాన్ని పరిమితం చేయడానికి ఒక మంచి భద్రతా విధానాన్ని రూపకల్పన చేసి, అమలు చేయాలి.
  •  ఉద్యోగులు ఏమి కాపీ చేస్తున్నారో దానిని పరిశీలించండి.
  • మీ సమాచారాన్ని భద్రపరచడానికి ప్రమాణీకరణ, అధికార మరియు అకౌంటింగ్ను అమలు చేయండి

మీ పరికరాన్ని కోల్పోయినప్పుడు ఏమి చేయాలి?

  • మీరు పాస్వర్డ్లు తదితర USB డ్రైవ్లో ఏదైనా వ్యక్తిగత లేదా సున్నితమైన సమాచారాన్ని భద్రపరచినట్లయితే, ఖాతా సృష్టించిన సమయంలో అందించిన భద్రతా ప్రశ్నలతో పాటు అన్ని పాస్వర్డ్లను వెంటనే మార్చండి [హ్యాకర్ దొంగిలించబడిన డ్రైవ్ లో నుండి మీ ఆన్లైన్ ఖాతా లాగిన్ సమాచారాన్ని డేటాను ఉపయోగించవచ్చు].
  • కోల్పోయిన డేటాకు వ్యతిరేకంగా తీసుకోవలనుకున్నఅన్ని భద్రతా చర్యలు నిర్ధారించుకోవాలి.

పరికర దొంగతనం ఎలా ఆపాలి?

  • భౌతికంగా డ్రైవ్ ను ఎల్లప్పుడూ ఒక కీ చైన్ టాగింగ్ ద్వారా సురక్షితంగా ఉంచుకోవాలి.
  • మీ డ్రైవ్ ను ఎప్పుడు గమనింపబడని ప్రదేశంలోవదిలకూడదు.
  • సెన్సిటివ్ సమాచారాన్ని ఎటువంటి ఎన్క్రిప్షన్ లేకుండా ఉంచకూడదు.

USB గా మొబైల్

కంప్యూటర్కు కనెక్ట్ చేసినప్పుడు మొబైల్ ఫోన్లు USB మెమరీ పరికరాలుగా ఉపయోగించవచ్చు. కంప్యూటర్కు కనెక్ట్ చేయడానికి మొబైల్ ఫోన్తో ఒక USB కేబుల్ అందించబడుతుంది.

  • ఒక మొబైల్ ఫోన్ వ్యక్తిగత కంప్యూటర్కు కనెక్ట్ అయినప్పుడు, అప్డేటెడ్ యాంటీవైరస్ను ఉపయోగించి బాహ్య ఫోన్ మెమరీ మరియు మెమరీ కార్డ్ను స్కాన్ చేయండి.
  • మీ ఫోన్ మరియు బాహ్య మెమరీ కార్డ్ యొక్క సాధారణ బ్యాకప్ తీసుకోండి ఎందుకంటే సిస్టమ్ క్రాష్ లేదా మాల్వేర్ వ్యాప్తి వంటి సంఘటన సంభవిస్తే కనీసం మీ డేటా సురక్షితంగా ఉంటుంది.
  •  కంప్యూటర్ నుండి డేటాను మొబైల్కు బదిలీ చేయడానికి ముందు, అప్డేటెడ్ యాంటీవైరస్ను ఉపయోగించి డేటాను స్కాన్ చేయాలి.
  • మీరు వెళ్ళిపోయో ముందు మీ కంప్యూటర్ నుండి USB కనెక్షన్ను తొలగించడం గుర్తుంచుకోండి.
  • వైరస్ ప్రభావిత డేటాను ఇతర మొబైల్లకు ఎన్నడూ ఫార్వార్డ్ చేయవద్దు.
Page Rating (Votes : 19)
Your rating: